కొవిడ్‌ జాగ్రత్తలతో విద్యుత్‌ బిల్లులు

ABN , First Publish Date - 2020-06-04T09:06:26+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ బిల్లులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది.

కొవిడ్‌ జాగ్రత్తలతో విద్యుత్‌ బిల్లులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ బిల్లులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న దాదాపు  2 వేలమంది ప్రైవేట్‌ స్పాట్‌ బిల్లింగ్‌ కార్మికులకు శానిటైజర్‌, ఫేస్‌ మాస్క్‌లు అందజేశారు. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని సీఎండీ  రఘుమారెడ్డి సిబ్బందికి సూచించారు. స్పాట్‌ బిల్లింగ్‌ కార్మికులకు ఫేస్‌ మాస్కులు, శానిటైజర్‌లు అవసరమైన మేర అందుబాటులో ఉండేలా చూడాలని సీఎండీ ఆదేశించారు.

Updated Date - 2020-06-04T09:06:26+05:30 IST