‘పేద పిల్లలు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలుగా ఎదగాలి’
ABN , First Publish Date - 2020-12-28T06:33:50+05:30 IST
దివంగత ఐఏఎస్ అధికారి ఏవీఎస్ రెడ్డి జయంతి వేడుకలను ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ మానసహిల్స్ సమీపంలోని ఏవీఎస్ రెడ్డి కాలనీలో దివంగత ఐఏఎస్ అధికారి ఏవీఎస్ రెడ్డి జయంతి వేడుకలను ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ మానసహిల్స్ సమీపంలోని ఏవీఎస్ రెడ్డి కాలనీలో నిర్వహించారు.

రాజేంద్రనగర్:
దివంగత ఐఏఎస్ అధికారి ఏవీఎస్ రెడ్డి జయంతి వేడుకలను ఆదివారం
రాజేంద్రనగర్ సర్కిల్ మానసహిల్స్ సమీపంలోని ఏవీఎస్ రెడ్డి కాలనీలో
నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సామ
ఇంద్రపాల్‌రెడ్డి ఏవీఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి
నివాళులర్పించారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్
సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన సమయంలో ఏవీఎస్‌రెడ్డి రూరల్
టెక్నాలజీ పార్కును తీసుకువచ్చారని, ఆ స్థలంలో ఉన్న క్రషర్ మిషన్‌లను
తొలగించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పేదలకు ఇళ్లు కట్టించారని
ఇంద్రపాల్‌రెడ్డి చెప్పారు. ఏవీఎస్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు,
తమ పిల్లలను బాగా చదివించి ఐఏఎస్, ఐపీఎ్‌సలుగా ఉద్యోగాలు సాధించనప్పుడే
ఏవీఎస్ రెడ్డి కల నేరవేరుతుందన్నారు. కార్యక్రమంలో జి.అంజయ్యగౌడ్,
పి.శ్రీనివా్‌సగౌడ్, సంజీవ, శివరామ్, జాతీయ గ్రామీణాభివృద్ధి
పంచాయతీరాజ్ సంస్థ ఉద్యోగులు ప్రమీల, రాజు పాల్గొన్నారు.