ఆహ్లాదంగా ‘ద్వారక’ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2020-02-12T09:10:33+05:30 IST

విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, చిన్నారుల ఆటపాటల నడుమ ద్వారక ఉన్నత పాఠశాల 31వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.

ఆహ్లాదంగా ‘ద్వారక’ వార్షికోత్సవం

రెడ్‌హిల్స్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, చిన్నారుల ఆటపాటల నడుమ ద్వారక ఉన్నత పాఠశాల 31వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల కార్యదర్శి జె. నరే్‌షరావు,  కరస్పాండెంట్‌ జె. సరితారావులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా నర్సరీ నుంచి పదో తరగతి  విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.  ఉత్తమ ప్రతిభ కనబర్చిన  రెంటాల మహతి, రెంటాల ప్రణతిలతో పాటు పలువురు విద్యార్థులకు బహుమతులు,  మెడల్స్‌ ప్రదానం చేశారు. 


సాంకేతికతపై అవగాహన అవసరం 

రాజేంద్రనగర్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమవుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు  అందిపుచ్చుకుని రైతాంగానికి చేరువ చేయాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు అన్నారు. వర్సిటీలోని నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ లైబ్రరీలో ఆయన మంగళవారం 12 రీసెర్చ్‌ క్యారెల్స్‌ని ప్రారంభించారు. పీజీ విద్యార్థిని డి. స్రవంతితో రిబ్బర్‌ కట్‌ చేయించారు.  కార్యక్రమంలో నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఇన్‌చార్జి ఎన్‌పీ రవికుమార్‌, వర్శిటీ అధికారులు, పాలకమండలి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-12T09:10:33+05:30 IST