జేఎన్టీయూ నుంచి డాక్టరేట్ డిగ్రీ పట్టా పొందిన దుంపల శాంతి
ABN , First Publish Date - 2020-10-29T00:16:44+05:30 IST
జేఎన్టీయూ నుంచి డాక్టరేట్ డిగ్రీ పట్టా పొందిన దుంపల శాంతి

హైదరాబాద్: పీహెచ్‌డీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్‌పై పరిశోధనలు చేసిన దుంపల శాంతి హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి డాక్టరేట్ డిగ్రీ పట్టా సాధించారు. హైదరాబాద్ జేఎన్టీయూ వైస్ చాన్సలర్, ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ చేతుల మీదుగా పట్టా అందుకున్నట్లు ఆమె సోమాజిగూడలో విలేకరులతో తెలిపారు. జేఎన్టీయూలో తన గురువు డాక్టర్ జీ.నరసింహ్మ, డాక్టర్ రమాకాంత్ మహంతి సహకారంతో పీహెచ్డీ పూర్తిచేసినట్లు ఆమె పేర్కొన్నారు. డి.కె ఇంటర్నేషనల్ రిసర్చ్ ఫౌండేషన్ వారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 2019 యంగ్ సైంటిస్టు అవార్డు అందుకున్నట్లు శాంతి తెలిపారు. ప్రస్తుతం నగరంలోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నట్లు శాంతి పేర్కొన్నారు.