డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముగ్గురిపై పీడీ యాక్ట్‌

ABN , First Publish Date - 2020-03-13T10:01:43+05:30 IST

గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాలను సరఫరా చేసి, కళాశాల విద్యార్థులు, యువతను వ్యసనపరులుగా మారుస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులపై పీడీయాక్టు నమోదు చేశారు.

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముగ్గురిపై పీడీ యాక్ట్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాలను సరఫరా చేసి, కళాశాల విద్యార్థులు, యువతను వ్యసనపరులుగా మారుస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులపై పీడీయాక్టు నమోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన రాజేష్‌ పరమేశ్వర్‌ జమ్‌డాడే, అనిల్‌ బోస్లే, మహబూబాబాద్‌కు చెందిన బడావత్‌ కిషన్‌ వైజాగ్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు గంజాయి సరఫరా చేసేవారు. సరుకును అక్కడ షబ్బీర్‌ అనే డీలర్‌కు అందజేసి అతడి నుంచి హెరాయిన్‌ తీసుకొని హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు. హెరాయిన్‌, గంజాయితో కుషాయిగూడలోని ఓ లాడ్జిలో దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. ముగ్గురిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తూ సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-03-13T10:01:43+05:30 IST