వృద్ధాశ్రమానికి నిత్యవసరాలు అందించిన ఆనంద్ మిత్రబృందం
ABN , First Publish Date - 2020-10-04T21:54:38+05:30 IST
ప్రముఖ వైద్యులు, దర్శకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ తన బంజారా మహిళా ఎన్‌జీవో ఆధ్వర్యంలో నగరంలోని ఓ వృద్ధాశ్రమానికి చేయూతగా నిలిచారు.
హైదరాబాద్: ప్రముఖ వైద్యులు, దర్శకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ తన బంజారా మహిళా ఎన్‌జీవో ఆధ్వర్యంలో నగరంలోని ఓ వృద్ధాశ్రమానికి చేయూతగా నిలిచారు. రాంపల్లిలో ఉన్న మానసిక వికలాంగులు, వృద్ధాశ్రమానికి భారీగా నిత్యవసరాలు అందించారు. తన మిత్రులు అనిత రవళ, హరిణి వరదరాజన్, కల్యాణి అంబటి సహాయ సహాకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆయన తెలిపారు. గత ఐదు నెలలుగా సహాయ శిబిరాలను దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో నిర్వహిస్తున్నామని, దాతలు తమకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.