పేదల ఆకలి తీర్చేందుకు విరాళాలు

ABN , First Publish Date - 2020-04-05T09:29:19+05:30 IST

పేదల ఆకలి తీర్చేందుకు విరాళాలు అందస్తూ పలువురు దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

పేదల ఆకలి తీర్చేందుకు విరాళాలు

బోడుప్పల్‌/మన్సూరాబాద్‌/కూకట్‌పల్లి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీర్చేందుకు విరాళాలు అందస్తూ పలువురు దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశంతో ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలోని మేడిపల్లిలో ఏర్పాటు చేసిన కలెక్షన్‌ సెంటర్‌ దాతలతో కిటకిటలాడుతోంది. నగదు, బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి ఉదారతను చాటుకుంటున్నారు. రెండు రోజుల్లోనే కలెక్షన్‌ సెంటర్‌కు సుమారు రూ.10 లక్షలకుపైగా విరాళాలు అందడం విశేషం. 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ బండారి మంజుల రవీందర్‌ ఆధ్వర్యంలో శనివారం విహారిక కాలనీకి చెందిన పలువురు బియ్యం, నగదు విరాళంగా అందజేశారు.


తూంకుంట్ల శ్రీధర్‌రెడ్డి రూ.10వేలు అందజేయగా, ఎర్ర ఐలేష్‌ రూ.30వేలు, శ్రీనివా్‌సరెడ్డి రూ.18వేలు, విహారిక సెక్టార్‌ రూ.32వేలు, సాయికృష్ణ ఎలక్ర్టికల్స్‌ రూ.10వేలు, బైరగోని రాజు రూ.25వేలతో  పాటుగా పలువురు విరాళాలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కుర్ర శివకుమార్‌గౌడ్‌, కార్పొరేటర్లు భీంరెడ్డి నవీన్‌రెడ్డి, అమర్‌సింగ్‌, అనంతరెడ్డి, హరిశంకర్‌రెడ్డి, నాయకులు తూంకుంట్ల శ్రీధర్‌రెడ్డి, బండారి రవీందర్‌, పప్పుల అంజిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, మాడ్గుల చంద్రారెడ్డి, కృష్ణగౌడ్‌ పాల్గొన్నారు. కాగా నాగోలు కార్పొరేటర్‌ చెర్కు సంగీతాప్రశాంత్‌గౌడ్‌ రూ.25,200 చెక్కును మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జెడ్‌సీ ఉపేందర్‌రెడ్డిలకు అందజేశారు. టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి డివిజన్‌ అధ్యక్షుడు కూన అమ్రే్‌షగౌడ్‌ రూ.లక్ష చెక్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అందజేశారు.

Updated Date - 2020-04-05T09:29:19+05:30 IST