రేషన్‌కార్డు లేని కూలీలకు బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2020-04-05T09:31:21+05:30 IST

నార్సింగ్‌ మున్సిపాలిటీలో రేషన్‌ కార్డులు లేని నిరుపేదలకు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ప్రభుత్వం తరుపున

రేషన్‌కార్డు లేని కూలీలకు బియ్యం పంపిణీ

నార్సింగ్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): నార్సింగ్‌ మున్సిపాలిటీలో రేషన్‌ కార్డులు లేని నిరుపేదలకు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ప్రభుత్వం తరుపున బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేఖ, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. మణికొండ మున్సిపాలిటీలోని 4వ వార్డులో వలస కూలీలకు వండిన ఆహార ప్యాకెట్‌లను 4వ వార్డు కౌన్సిలర్‌ వందన నాగేశ్‌ వారి గుడిసెల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. నార్సింగ్‌ మున్సిపాలిటీ 14వ వార్డులో బీజేపీ కౌన్సిలర్‌ ఆదిత్యరెడ్డి వలస కూలీలకు ఇంటింటికీ వెళ్లి బియ్యం ఇతర నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-05T09:31:21+05:30 IST