జవహర్‌నగర్ పరీక్షా కేంద్రంలో మాస్క్‌ల పంపిణీ
ABN , First Publish Date - 2020-03-20T09:45:34+05:30 IST
పదో తరగతి విద్యార్థులకు జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య గురువరాం ఆల్‌ది బెస్ట్ చెప్తూ ఒక్కొక్కరికి మాస్కులను పంపిణీ చేశారు.
జవహర్‌నగర్, మార్చి 19(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులకు జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య గురువరాం ఆల్‌ది బెస్ట్ చెప్తూ ఒక్కొక్కరికి మాస్కులను పంపిణీ చేశారు. పరీక్షలో ఎలాంటి భయమూ లేకుండా నిర్భయంగా రాయాలని విద్యార్థులకు ఆమె సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరూ భయాందోళనకు గురికావద్దన్నారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లపై ప్రధానోపాద్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో ఉన్న విద్యార్థులకు సిబ్బందికి పంపిణీ చేయాలని మేయర్ ప్రధానోపాధ్యయుడికి మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.