విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలు ఒకే సంఘంగా సంఘటితం కావాలి
ABN , First Publish Date - 2020-12-28T06:17:21+05:30 IST
ఆదివారం అంబర్‌పేట ఆలీకేఫ్ చౌరస్తా సమీపంలోని అంబేడ్కర్‌నగర్‌లో గల మేదర సంఘం కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం గ్రేటర్ హైదరాబాద్ నూతన సంవత్సరం

మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
గోల్నాక, డిసెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): ఆదివారం అంబర్‌పేట ఆలీకేఫ్ చౌరస్తా సమీపంలోని అంబేడ్కర్‌నగర్‌లో గల మేదర సంఘం కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం గ్రేటర్ హైదరాబాద్ నూతన సంవత్సరం-2021 క్యాలెండర్ ఆవిష్కరణ సభ సంఘం అధ్యక్షుడు నాగారం భాస్కర్‌చారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ స్పీకర్ మధుసూదనాచారి క్యాలెండర్‌ను ఆవిష్కరించి ప్రసంగిస్తూ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలు ఇకనైనా పలు సంఘాలుగా కాకుండా ఒకే సంఘంగా సంఘటితం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు భవనాలను నిర్మాణం చేస్తున్నదని, తమ సంఘానికి కూడా స్థలాన్ని, నిధులను కేటాయించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, తాజా కార్పొరేటర్లు ఇ.విజయకుమార్‌గౌడ్, అమృత, బి.పద్మావెంకటరెడ్డి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు లాలుకోట వెంకటాచారి, అధ్యక్షుడు కుందారం గణే్‌షచారి, కోశాధికారి పులిగిల్ల రంగాచారి, అఖిలభారతీయ విశ్వకర్మ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెదునోజు యాదగిరిచారి, విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మధన్‌మోహన్‌చారి తదితరులు పాల్గొన్నారు.