డయాలసిస్‌ పేషెంట్లకు పాసులు: సీపీ సజ్జనార్‌

ABN , First Publish Date - 2020-03-30T09:32:01+05:30 IST

డయాలసిస్‌ పేషంట్లకు సైబరాబాద్‌ పోలీసులు ఇంటికి వెళ్లి పాసులు అందించారు.

డయాలసిస్‌ పేషెంట్లకు పాసులు: సీపీ సజ్జనార్‌

అత్యవసర సేవలకు 9490617440/ 9490617431 


హైదరాబాద్‌ సిటీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): డయాలసిస్‌ పేషంట్లకు సైబరాబాద్‌ పోలీసులు ఇంటికి వెళ్లి పాసులు అందించారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో డయాలసిస్‌కు ఇబ్బందులు కలుగకుండా ఈ ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంకు రంగారెడ్డి జిల్లా పరిధిలో 326 మంది, మేడ్చెల్‌ పరిధిలో 330 మంది డయాలసిస్‌ పేషంట్లు పాసుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జారీ చేసిన పాసులను ఇంటికి తీసుకెళ్లి అందించారు.


అవసరమైన వారికి వాహన సదుపాయం కూడా కల్పించారు. అత్యవసర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారిగా డీసీపీ లావణ్యను నియమించారు. సైబరాబాద్‌ పరిధిలో అత్యవసర సేవలు పొందేందుకు 9490617440 లేదా 9490617431 నెంబర్లపై సంప్రదించాలని సీపీ సజ్జనార్‌ కోరారు. 

Updated Date - 2020-03-30T09:32:01+05:30 IST