జనాలే లేరు.. మీరేం లీడర్లు భాయ్‌ : ఎంపీ ధర్మపురి అరవింద్‌

ABN , First Publish Date - 2020-11-26T16:55:53+05:30 IST

శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జీ, ఎంపీ ధర్మపురి అరవింద్‌ పలు డివిజన్లలో అభ్యర్థులకు మద్దతుగా బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదర్‌నగర్‌ డివిజన్‌ హెచ్‌ఎంటీహిల్స్‌ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో

జనాలే లేరు.. మీరేం లీడర్లు భాయ్‌ : ఎంపీ ధర్మపురి అరవింద్‌

హైదర్‌నగర్‌, నవంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జీ, ఎంపీ ధర్మపురి అరవింద్‌ పలు డివిజన్లలో అభ్యర్థులకు మద్దతుగా బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదర్‌నగర్‌ డివిజన్‌ హెచ్‌ఎంటీహిల్స్‌ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. ఆయన సమావేశానికి వచ్చే సరికి జనం లేరు. దీంతో డివిజన్‌ నాయకులపై ధర్మపురి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జన సమీకరణ చెయ్యలేని మీరేం నాయకులు. ఈ మాత్రం దానికి రాజకీయం చేయడం అవసరమా’ అని ప్రసంగించకుండానే సభా స్థలినుంచి వెనుతిరిగి వెళ్లారు. 

Updated Date - 2020-11-26T16:55:53+05:30 IST