‘సరోజినీ’లో 37 మంది అనుమానితులు
ABN , First Publish Date - 2020-04-01T09:19:19+05:30 IST
రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసింది.

మెహిదీపట్నం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మెహిదీపట్నంలోని సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో 150 పడకల ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. మంగళవారం ఒక్కరోజే 37 మందిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుమానితులను ఐసొలేషన్ వార్డులో ఉంచారు.
వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారిని కలసిన వారు ఉన్నారని ఐసొలేషన్ ఇన్‌చార్జి, నోడల్ అధికారి డాక్టర్ అనూరాధ తెలిపారు. మంగళవారం నుంచే ఐసోలేషన్‌లో ఉంచడం ప్రారంభించామని ఆమె అన్నారు. నగరంలోని బంజారాహిల్స్, గోల్కొండ, లంగర్‌హౌజ్ పోలీ్‌సస్టేషన్ల పరిధిలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వారిని అబ్జర్వేషన్‌లో ఉంచామని ఆమె తెలిపారు.