దేశరక్షణలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరం

ABN , First Publish Date - 2020-12-11T07:15:23+05:30 IST

దేశరక్షణ వ్యవస్ధలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమని సీనియర్‌ కల్నల్‌ కమాడెంట్‌, ఈఎంఈ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌కపూర్‌ అన్నారు.

దేశరక్షణలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరం
స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న ఈఎంఈ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌కపూర్‌

ఈఎంఈ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌కపూర్‌

అల్వాల్‌, డిసెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): దేశరక్షణ వ్యవస్ధలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమని సీనియర్‌ కల్నల్‌ కమాడెంట్‌, ఈఎంఈ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌కపూర్‌ అన్నారు. తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన 101వ డిగ్రీ ఇంజనీర్‌ కోర్సు, 34వ టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్స్‌ సాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇంజనీరింగ్‌ పట్టభద్రులైన వారికి పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జీవితంలో ఏవిధంగా నిలదోక్కుకోవాలి, చాలెంజ్‌ పై ఏ విధంగా ఫోకస్‌ చేయాలనే అంశలపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా వ్యూకార్ట్‌ అనే సూత్రాన్ని వివరించారు. ఎంసీఈఎంఈ కమాండెంట్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నారాయణన్‌ కూడా మాట్లాడారు. 101వ డిగ్రీ ఇంజనీరింగ్‌ కోర్సులో కెప్టెన్‌ అనురాగ్‌ సింగ్‌ డీజీఈఎంఈ ట్రోఫీని అందుకున్నారు. డీఈ కోర్సులో మెరిట్‌ క్రమంలో మొదటి స్ధానం లో నిలిచిన కెప్టెన్‌ రాజావత్‌ డీజీఈఎంఈ గోల్డ్‌మెడల్‌ పొందారు. టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సులలో ఆల్‌రౌండర్‌ ప్రదర్శన కనబర్చిన శర్మకు డీజీఈఎంఈ గోల్డ్‌మెడల్‌ అందజేశారు.

Updated Date - 2020-12-11T07:15:23+05:30 IST