కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ల తగ్గుముఖం

ABN , First Publish Date - 2020-08-01T10:20:41+05:30 IST

కార్వాన్‌, నాంపల్లి నియోజకవర్గాల్లోని ప్రాథమిక పట్టణ ఆరోగ్య(యూపీహెచ్‌సీ) కేంద్రాల్లో చేపడుతు న్న కరోనా పరీక్షల్లో

కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ల తగ్గుముఖం

సిటీ న్యూస్‌ నెట్‌వర్క్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కార్వాన్‌, నాంపల్లి నియోజకవర్గాల్లోని ప్రాథమిక పట్టణ ఆరోగ్య(యూపీహెచ్‌సీ) కేంద్రాల్లో చేపడుతు న్న కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ల శాతం తగ్గుముఖం పట్టింది. నాలుగు రోజులుగా పన్నీపూర, కుమ్మర్‌వాడీ, గుడిమల్కాపూర్‌, కార్వాన్‌- 1, 2 యూపీహెచ్‌సీల్లో చాలా తక్కువ శాతం పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. 27వ తేదీన పన్నీపురాలో 25 మందికి పరీక్షలు చేయగా ఒక్క పాజిటివ్‌ కేసుకూడా బయట పడలేదు. కార్వాన్‌- 2లో 23 పరీక్షలు చేయగా 4 పాజిటివ్‌లు వచ్చాయి. కుమ్మర్‌వాడీలో 120కి 20పాజిటివ్‌, కార్వాన్‌-1లో 44కు 9 పాజిటివ్‌, గుడిమల్కాపూర్‌లో 57కు 19 పాజిటివ్‌ వచ్చాయి. దాదాపుగా గత నాలుగు రోజులుగా అదే శాతం కొనసాగుతోంది.  


కార్వాన్‌లో..

కార్వాన్‌ నియోజకవర్గంలోని గోల్కొండ కుమ్మర్‌వాడీ యూపీహెచ్‌సీలో 29 మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి, గుడిమల్కాపూర్‌లో 28 మందిలో నలుగురికి, కార్వాన్‌-1లో 38 మందిలో నలుగురికి, పన్నీపూరాలో 26 మందిలో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. 


యూసు్‌ఫగూడలో..

 యూసు్‌ఫగూడ డివిజన్‌లో 11, వెంగళరావునగర్‌లో 3, ఎర్రగడ్డలో5, రహ్మత్‌నగర్‌లో 10, బోరబండలో 16 కేసులు నమోదయ్యాయి.  


కూకట్‌పల్లిలో..

జగద్గిరిగుట్ట యూపీహెచ్‌సీ పరిధిలో 10, ఎల్లమ్మబండలో 12, బాలానగర్‌లో 17 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


కుత్బుల్లాపూర్‌లో..

కుత్బుల్లాపూర్‌ యూపీహెచ్‌సీలో 43 మం దిలో 18 మందికి, గాజులరామారంలో 55 మందిలో 10మందికి, నిజాంపేట్‌లో 78 మం దిలో 17మందికి, షాపూర్‌నగర్‌లో 44 మంది లో ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది.


సీతాఫల్‌మండి డివిజన్‌లోని మహ్మద్‌గూడలో రెడ్‌క్రాస్‌ ఆస్పత్రిలో 35మందికి పరీక్షలు చేయగా నలుగురికి, చిలకలగూడ శ్రీనివా్‌సనగర్‌లో 29మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. 


ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు కిట్ల కొరత? 

బోరబండ, రహ్మత్‌నగర్‌ డివిజన్‌లలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు కిట్ల కొరతతో ఎక్కువ మందికి యూపీహెచ్‌సీల్లో పరీక్షలు చేయడం లేదు. పరీక్ష చే యించుకునేందుకు క్యూలో ఉన్న వారు మిగతా కేం ద్రాలకు వెళ్తున్నారు. కాగా శ్రీరామ్‌నగర్‌లో 54 మం దికి పరీక్షలు చేయగా 8మందికి, బోరబండలో 72 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి, వినాయక్‌నగర్‌లో 32 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

Updated Date - 2020-08-01T10:20:41+05:30 IST