హుస్సేన్‌సాగర్‌ నాలాలో మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-07-08T18:48:38+05:30 IST

హుస్సేన్‌సాగర్‌ నాలాలో 40 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి మృతదేహాన్ని గాంధీనగర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న

హుస్సేన్‌సాగర్‌ నాలాలో మృతదేహం లభ్యం

కవాడిగూడ, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): హుస్సేన్‌సాగర్‌ నాలాలో 40 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి మృతదేహాన్ని గాంధీనగర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు లోయర్‌ట్యాంక్‌బండ్‌ గోషామహల్‌ సమీపంలో నాలాలో మృతదేహం కనిపించడంతో బయటకు తీయించారు. మృతుడు శరీరంపై నలుపు రంగు టీషర్టు, అదే రంగు ట్రాక్‌ ప్యాంట్‌ ఉంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అతడి సంబంధీకులు ఎవరైనా ఉంటే గాంధీనగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో లేదా  04027853585, 9052657394 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కోరారు. 

Updated Date - 2020-07-08T18:48:38+05:30 IST