తండ్రి ల్యాప్‌టాప్‌లో కుమార్తె నగ్న చిత్రాలు

ABN , First Publish Date - 2020-08-20T09:56:13+05:30 IST

నాచారంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె నగ్న చిత్రాలు తీసి ల్యాప్‌టా్‌పలో భద్రపరచుకున్న సవతి తండ్రిని పోలీసులు అరెస్టు

తండ్రి ల్యాప్‌టాప్‌లో కుమార్తె నగ్న చిత్రాలు

నిందితుడిపై పోక్సో కేసు


నాచారం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నాచారంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె నగ్న చిత్రాలు తీసి ల్యాప్‌టా్‌పలో భద్రపరచుకున్న సవతి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మొదటి భార్య చనిపోవడంతో రాజేశ్‌ అనే వ్యక్తి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య కుమార్తె ఫొటోలు తీసి ల్యాప్‌టా్‌పలో భద్రపరుచుకోవడం చూసిన బాధితురాలు తల్లికి విషయం చెప్పింది. అతడు కొంతకాలంగా భార్యను కూడా వేధిస్తుండడంతో తల్లీకుమార్తెలు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు. 

Read more