దాసోజు శ్రవణ్‌కు పితృ వియోగం

ABN , First Publish Date - 2020-12-15T06:31:10+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తండ్రి కృష్ణమాచారి(79) ఆకస్మికంగా మృతి చెందారు.

దాసోజు శ్రవణ్‌కు పితృ వియోగం
కృష్ణమాచారి (ఫైల్‌)

ఖైరతాబాద్‌/రాంనగర్‌, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తండ్రి కృష్ణమాచారి(79) ఆకస్మికంగా మృతి చెందారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను శనివారం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఇన్‌ఫెక్షన్‌ ఉండడంతో చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు. కృష్ణమాచారి భార్య జోగమ్మకు కూడా వైరస్‌ సోకడంతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణమాచారి కో-ఆపరేటివ్‌ విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన అంత్యక్రియలు అంబర్‌పేట శ్మశానవాటికలో సోమవారం సాయంత్రం పూర్తయ్యాయి. 

పవన్‌ కళ్యాణ్‌ సంతాపం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సపార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తండ్రి కృష్ణమాచారి(79) మృతికి పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కృష్ణమాచారి మృతికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్స పొందుతున్న కృష్ణమాచారి సతీమణి జోగమ్మ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

Read more