ఎమ్మెల్యే దానం కారును అడ్డుకున్న మహిళలు

ABN , First Publish Date - 2020-11-13T12:08:54+05:30 IST

ఈ కార్యక్రమం అనంతరం బయలు దేరేందుకు సిద్ధమైన ఆయన కారును

ఎమ్మెల్యే దానం కారును అడ్డుకున్న మహిళలు

హైదరాబాద్/బేగంపేట : వరద సాయం అందలేదని బీఎస్‌మక్తాకు చెందిన పలువురు మహి ళలు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేం దర్‌ కారును అడ్డుకున్నారు. గురువారం నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్‌ బీఎస్‌మక్తాలో ఏర్పాటు చేసిన బస్తీ దావఖానా ప్రారంభోత్సవానికి మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం బయలు దేరేందుకు సిద్ధమైన ఆయన కారును బస్తీ మహిళలు అడ్డుకున్నారు.


బీఎస్‌మక్తాలో వరద సాయం కేవలం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇస్తున్నారని పలువురు మహిళలు ఆగ్రహంతో ఎమ్మెల్యే దానం కారుకు అడ్డుగా వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వారించేందుకు యత్నించగా బీజేపీ నాయకుడు తలాని శ్రీనివాస్‌ తన అనుచరులతో కలిసి స్థానికులకు మద్దతుగా నిలిచారు. బాధితులందరికీ వరద సాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే దానం వారికి హామీ ఇవ్వడంతో శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2020-11-13T12:08:54+05:30 IST