హేమంత్ హత్య కేసులో 39 పేజీల చార్జిషీటు దాఖలు
ABN , First Publish Date - 2020-12-30T06:27:32+05:30 IST
హేమంత్ పరువు హత్యకు సంబంధించి 39 పేజీల చార్జిషీటు దాఖలు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): హేమంత్ పరువు హత్యకు సంబంధించి 39 పేజీల చార్జిషీటు దాఖలు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన వార్షిక క్రైమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ కేసులో 18 మంది నిందితులను అరెస్టు చేశామని, సాక్ష్యాధారాలు సేకరించి 86 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 2021 జనవరి-1న ఈ కేసు ట్రయల్‌కు రానున్నట్లు పేర్కొన్నారు.