అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-29T06:54:15+05:30 IST

అదనపు కట్నంకోసం అత్తింటి చిత్రహింసలు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది.

అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

జీడిమెట్ల, డిసెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): అదనపు కట్నంకోసం అత్తింటి చిత్రహింసలు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పెరుమళ్ల స్వప్న(29), రంజిత్‌ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. చింతల్‌ ప్రసూననగర్‌లో నివసిస్తున్నారు. రంజిత్‌ జీడిమెట్లలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా రంజిత్‌, అతడి తల్లి సావిత్రి, మరిది అనిల్‌, రాజు అదనపు కట్నం కోసం స్వప్నను చిత్రహింసలు పెట్టేవారు. స్వప్న సోదరుడి వివాహం కావడంతో ఆడపిల్ల కట్నం కింద రూ. 2 లక్షలు ఇవ్వాలని అత్తింటివారు వేధింపులకు గురి చేశారు. దీంతో ఈ నెల 26న లక్ష రూపాయలు తీసుకొచ్చింది. 27వ తేదీన ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-29T06:54:15+05:30 IST