బీరు సీసాతో యువకుడిపై దాడి

ABN , First Publish Date - 2020-12-19T05:58:46+05:30 IST

బీరుసీసాతో యువకుడిపై పది మంది దాడిచేసి గాయపర్చారు.

బీరు సీసాతో యువకుడిపై దాడి

బంజారాహిల్స్‌, డిసెంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): బీరుసీసాతో యువకుడిపై పది మంది దాడిచేసి గాయపర్చారు. రహ్మత్‌నగర్‌ హబీబ్‌ఫాతిమా నగర్‌కు చెందిన అజాన్‌ కొంత కాలం క్రితం ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి కాళ్లు పనిచేయక ఇబ్బంది పడుతున్నాడు. గురువారం అర్ధరాత్రి టిఫిన్‌ చేసేందుకు యూసు్‌ఫగూడ వైన్స్‌ సమీపంలోకి వెళ్లాడు. టిఫిన్‌ చేసి నిలబడి ఉండగా లడ్డూ మరో తొమ్మిది మంది మద్యం మత్తులో అక్కడికి వెళ్లారు. అకారణంగా అజాన్‌పై దాడి చేశారు. బీరు బాటిల్‌తో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అజాన్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. 


Read more