టపాసులు పేలేనా..?

ABN , First Publish Date - 2020-11-07T09:07:19+05:30 IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని క్రాకర్స్‌ (టాపాసులు) అమ్మే వ్యాపారులకు ఇప్పటి వరకూ అనుమతులు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు

టపాసులు పేలేనా..?

అనుమతులు రాక క్రాకర్స్‌ వ్యాపారుల ఆవేదన


హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 6(ఆంధ్రజ్యోతి) : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని క్రాకర్స్‌ (టాపాసులు) అమ్మే వ్యాపారులకు ఇప్పటి వరకూ అనుమతులు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఫైర్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చిన తర్వాతనే  పోలీస్‌ పర్మిషన్‌ ఇచ్చే అవకాశం ఉండటంతో వ్యాపారులు సర్కిల్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్‌ అనుమతులు తీసుకున్న వ్యాపారులు జీహెచ్‌ఎంసీ అధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. క్రాకర్స్‌ విక్రయాలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలు అందలేదని సర్కిల్‌ అఽధికారులు చెబుతున్నారు. దీంతో దుకాణాల ఏర్పాటుపై డైలమా ఏర్పడింది. మరోవైపు ఈ నెల 10లోపు అనుమతి తీసుకోవాలని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. రూ. కోట్లలో సరుకు తెచ్చి గోదాముల్లో పెట్టుకున్న వ్యాపారులు మల్లగుల్లాలు పడుతున్నారు. తక్షణమే అధికారులు అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నారు. 


Updated Date - 2020-11-07T09:07:19+05:30 IST