నగర పౌరులకు కృతజ్ఞతలు చెప్పిన సీపీ

ABN , First Publish Date - 2020-03-23T09:19:45+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన పౌరులకు నగర పోలీసుల తరఫున సీపీ అంజనీకుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

నగర పౌరులకు కృతజ్ఞతలు చెప్పిన సీపీ

ట్యాంక్‌బండ్‌పై చప్పట్లతో సంఘీభావం


కవాడిగూడ, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో భాగంగా జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన పౌరులకు నగర పోలీసుల తరఫున సీపీ అంజనీకుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. పదివేలకు పైగా పోలీసు, సిబ్బంది మీడియా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, వైద్యులు, నర్సులు కరోనా వైరస్‌ కట్టడి కోసం పోరాడుతున్నారని ఆయన అన్నారు. ఆదివారం జనతా కర్ప్యూ సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న లేపాక్షి వద్ద చప్పట్లతో జనతా కర్ఫ్యూకు ఆయన సంఘీభావం తెలిపారు.


కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్లు షికా గోయల్‌, అనిల్‌కుమార్‌, చౌహాన్‌, సెంట్రల్‌జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌తోపాటు పోలీసు, ట్రాఫిక్‌ అఽధికారులు పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు కాగానే సైరన్‌ మోగించి చప్పట్లు కొడుతూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితిలలైనా ఎదుర్కోవడానికి, కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ కె బాబురావు, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌, గాంధీనగర్‌ సిఐ శ్రీనివా్‌సరావు, డిఐ ప్రమోద్‌కుమార్‌,చిక్కడపల్లి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితోపాటు పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-23T09:19:45+05:30 IST