హైదరాబాద్‌లో నాటు కోడికి పెరిగిన డిమాండ్
ABN , First Publish Date - 2020-07-19T15:42:22+05:30 IST
నాటు కోడి గుడ్డు, మాంసం బలవర్ధక ఆహారం అనే విషయం అందరికీ తెలిసిందే.

హైదరాబాద్ : నాటు కోడి గుడ్డు, మాంసం బలవర్ధక ఆహారం అనే విషయం అందరికీ తెలిసిందే. బ్రాయిలర్ కోళ్లతో పాటు రకరకాలు కోళ్లు మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ నాటు కోడికి మాత్రం ఇప్పటికీ గిరాకీ తగ్గలేదు. అయితే రోజురోజుకూ నాటు కోడి చికెన్ ధర కొండెక్కుతోంది. నిన్న మొన్నటి వరకూ ఉన్న రేటు ఆదివారం వచ్చేసరికి ఒక్కసారిగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో నాటు కోడికి డిమాండ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం కేజీ నాటు కోడి ధర రూ. 400గా ఉంది. ఇంతరేటు ఉన్నప్పటికీ మాంసం ప్రియులు మాత్రం నాటు కోడికే ప్రాధాన్యత ఇస్తూ కొంటున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందని జనాలు గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు ఇవాళ బోనాలు కూడా ఉండటంతో నాటు కోడి క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.