మాస్క్‌లు.. గ్లౌజ్‌లు.. హ్యాండ్ శానిటైజర్లు..!
ABN , First Publish Date - 2020-03-13T09:25:30+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. పౌరుల్లో అవగాహన కల్పించడంతోపాటు సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు బాధితులుగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నిర్ణయం
ఉద్యోగులు, కార్మికులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు
హైదరాబాద్ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. పౌరుల్లో అవగాహన కల్పించడంతోపాటు సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు బాధితులుగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పారిశుధ్య కార్మికులు రేడియం అఫ్రా న్లు, గ్లౌజ్‌లు, మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని, దీనికి క్షేత్రస్థాయిలో పనిచేసే శానిటరీ సూపర్‌వైజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను బాధ్యులను చే యాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను ఆదేశించారు. బయోమెట్రిక్ యంత్రాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఇతర రాష్ర్టాల తరహాలో బయోమెట్రిక్ హాజరు తొలగించే అంశం పై చర్చించినా.. పారిశుధ్య నిర్వహణపై ప్రభావం పడుతుందన్న కారణం తో హాజరు తప్పనిసరిగా తీసుకోవాలని నిర్ణయించారు.
కరోనా వైరస్ వ్యా ప్తిని అరికట్టే క్రమంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. గురువారం కమిషనర్ డీఎస్ లోకే్‌షకుమార్‌తో కలిసి అదనపు, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు సంబంధించి మొదటిసారి బయోమెట్రిక్ హాజరును శీతాకాలంలో ఉదయం 7.30గంటల వరకు అనుమతించామని, వేసవిని దృష్టి లో ఉంచుకొని ఉదయం 5నుంచి 6గంటల వరకు మాత్రమే హాజరు తీసుకోవాలన్నారు. జూన్‌వరకు ఇదేవిధానం పాటించాలన్నారు. ఉదయం 6.30 గంటల వరకు పారిశుధ్య పను లు పూర్తయిన ప్రాంతాల్లో చెత్తను వెంటనే తొలగించాలని సూచించారు.
ఇంజనీర్లకు బాధ్యతలు..
పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు ఇంజనీర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో డీఈ, ఏఈలకు విధులపై అవగాహన కల్పించాలని మేయర్ పేర్కొన్నారు. శానిటరీ సూపర్ వైజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా రేడియం అఫ్రాన్‌లు ధరించాలన్నారు.