లాక్‌డౌన్‌పై అవగాహన కల్పిస్తున్న సామాన్యుడు

ABN , First Publish Date - 2020-03-25T22:05:52+05:30 IST

లాక్‌డౌన్‌పై జనానికి అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులే కాదు సామాన్యులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు.

లాక్‌డౌన్‌పై అవగాహన కల్పిస్తున్న సామాన్యుడు

హైదరాబాద్: లాక్‌డౌన్‌పై జనానికి అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులే కాదు సామాన్యులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటూ.. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటూ ఓ యువకుడు చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. లాక్‌డౌన్ అని రాసి ఉన్న ప్లకార్డు చేతపట్టి ... వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాడు సదరు యువకుడు. మాస్క్ ధరించి.. స్కూటీపై ప్రయాణిస్తూ.. ఒక వీధి నుంచి మరో వీధికి వెళుతూ.. జనం కనపడితే వారి దగ్గర ఆగి.. వారికి కరోనా, లాక్‌డౌన్‌ల గురించి వివరిస్తున్నాడు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన విధులను తెలియజేస్తున్నాడు. ఈ దృశ్యం నగరంలోని కర్మాన్‌ఘాట్‌లో కెమేరా కంటికి చిక్కింది. స్థానికంగా నివసించే కాలేజీ అధ్యాపకుడు సుధీర్ బీకుమాండ్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 

Read more