కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
ABN , First Publish Date - 2020-06-23T10:45:05+05:30 IST
కరోనా వైర్‌సను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. కరోనాను నియంత్రించడం,

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి
పలు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిరసన.. అరెస్ట్
రాజేంద్రనగర్/గోల్నాక/సరూర్‌నగర్/బౌద్ధనగర్/గచ్చిబౌలి/బాలానగర్/ఓల్డుబోయినపల్లి/మల్కాజిగిరి/ఎర్రగడ్డ/రెడ్‌హిల్స్/బర్కత్‌పుర/నల్లకుంట, జూన్ 22(ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. కరోనాను నియంత్రించడం, పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ సోమవారం ప్రభుత్వాస్పత్రుల ఎదుట ధర్నాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలోని రంగారెడ్డిజిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని అన్నా రు.
ప్రైవేటులో కరోనా పరీక్షలు చేయించుకుంటున్న వారి ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులకు రక్షణ పరికరాలు అందించి వారి కుటుంబ సభ్యులకు తరచూ పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ మోండ్ర కొమురయ్య, నాయకులు పాల్గొన్నారు.
బాలాపూర్ మండలంలోని బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్ల బీజేపీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్‌రెడ్డి, పెండ్యా ల నర్సింహ ఆధ్వర్యంలో సోమవారం బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కొలన్ శంకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
సీతాఫల్‌మండి కుట్టివెల్లోడి ప్రభుత్వ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట బీజేపీ డివిజన్ అధ్యక్షుడు అంబాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు.
కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రి ఎదుట బీజేపీ నాయకు లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ గజ్జల యోగానంద్, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ బాలానగర్ డివిజన్ అధ్యక్షుడు జీఆర్. రమేష్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ శంకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సురేందర్‌రెడ్డి, నాయకులు, ఫతేనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి నాగేంద్ర తదితరులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు వినతి పత్రం అందజేశారు. బీజేపీ ఓల్డుబోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజూగౌడ్ ఆధ్వర్యంలో రవికుమార్‌గౌడ్, రఘు తదితరులు పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న నేతలను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బీజేపీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ శాఖ ఆధ్వర్యంలో ఎర్రగడ్డలోని ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రి ఎదుట ఆ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి అట్లూరి రామకృష్ణ, జాతీయ నాయకురాలు బంగారు శ్రుతి, నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర అధికార ప్రతినిధి కొలన్ సత్యనారాయణ, అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ ప్రేమ్ కుమార్, బీజేపీ జాయింట్ కన్వీనర్ అంతారం శాంతి కుమార్, తెలంగాణ విమోచన కమిటీ బీజేపీ నగర కన్వీనర్ కాట్రాజ్ రాజ్ కుమార్, బీజేపీ నగర కో ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కలిమెర లింగప్ప, నగర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాల్లోని పలు ఆస్పత్రుల ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. బీజేపీ రెడ్‌హిల్స్ డివిజన్ అధ్యక్షుడు కె.క్రాంతి ఆధ్వర్యంలో నిలోఫర్ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు రాకేష్ జైశ్వాల్ ఆధ్వర్యంలో కోఠిలోని డీఎం అండ్ హెచ్‌ఎస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన నాయకులను, కార్యకర్తలను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రి ప్రధాన గేటు ఎదుట అంబర్‌పేట నియోజకవర్గ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేట ర్లు సాంబశివగౌడ్, రమేష్, బీజేపీ నగర ఉపాధ్యక్షుడు రమేష్‌యాదవ్, నగర ఓబీసీ సెల్ అధ్యక్షుడు వినోద్‌యాదవ్, బేటీ బచావో, బేటీ పడావో రాష్ట్ర కన్వీనర్ కె.గీతామూర్తి, అంబర్‌పేట నియోజకవర్గ కన్వీనర్ అజయ్‌కుమార్, నల్లకుంట డివిజన్ అధ్యక్షుడు ఎం.శ్యామ్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.