కొత్త ప్రాంతాలకు కరోనా
ABN , First Publish Date - 2020-07-27T10:06:17+05:30 IST
కొత్త ప్రాంతాలకు కూడా కరోనా వైరస్ సోకింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సిటీ న్యూస్‌నెట్‌వర్క్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కొత్త ప్రాంతాలకు కూడా కరోనా వైరస్ సోకింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తాజాగా కరోనా కేసులు నమోదైన కొన్ని ప్రాంతాలు ఇవే..
హయత్‌నగర్ సర్కిల్ పరిధిలోని ఇందిరానగర్, ఇంద్రప్రస్థకాలనీ, రాక్‌టౌన్, ఎస్‌ఎ్‌ఫసీ కాలనీ, లలితానగర్, జడ్జ్‌సకాలనీ, చాణక్యపురికాలనీ, సౌజన్యకాలనీ, మన్సూరాబాద్, అన్మగల్ హయత్‌నగర్, ఎన్‌జీఓ్‌సకాలనీ, భవానీనగర్ కాలనీ, గాంధీనగర్ ప్రాంతాల్లో 17 మంది కరోనా బారిన పడ్డారు.
ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలోని వనస్థలిపురం, మణిపురికాలనీ, కృష్ణానగర్, ఎల్‌బీనగర్, హస్తినాపురం, మల్లికార్జుననగర్, శివగంగాకాలనీ, సాయిరామ్‌నగర్, శివపురికాలనీ, టీచర్స్‌కాలనీ, ఎన్‌జీఓ్‌సకాలనీ, చంపాపేట, కృష్ణానగర్‌కాలనీ, భూపే్‌షగుప్తానగర్ ప్రాంతాల్లో 43 మందికి వైరస్ సోకింది.
సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని కొత్తపేట, చైతన్యపురి, న్యూదిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, ఎన్‌టీఆర్‌నగర్, దుర్గానగర్, శాంతినగర్, గ్రీన్‌హిల్స్‌కాలనీ, ఓల్డ్ మారుతీనగర్, బాపూనగర్, మార్గదర్శికాలనీ, శారదానగర్, ఎంసీహెచ్‌కాలనీ, వికా్‌సనగర్, శ్రీనివాసకాలనీ, మధురానగర్, హనుమాన్‌నగర్, పీ అండ్ టీ కాలనీ, విజయపురికాలనీ ప్రాంతాల్లో 36 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
మలక్‌పేట సర్కిల్-6 పరిధిలోని ముసారాంబాగ్, బాలమ్మదానమ్మ బస్తీ, ఇంద్రానగర్, శాలివాహననగర్, చావునీ, ఆజంపుర, మలక్‌పేట కాలాడేర, జేవీబీ టెంపుల్ లేన్, సైదాబాద్, చంపాపేట, సంతోష్‌నగర్, న్యూసంతో్‌షనగర్ ప్రాంతాల్లో మొత్తం 26 కేసులు నమోదయ్యాయి.
రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్‌లలో 15 మందికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.
కూకట్‌పల్లి ప్రాంతంలో ఆదివారం 20 మందికి కరోనా సోకింది.
కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎ్‌సరావునగర్, కమలానగర్, డీఏఈ కాలనీ, జైజవాన్ కాలనీ, పరిమళనగర్, కుషాయిగూడ, వాసవిశివనగర్, చక్రిపురం, చర్లపల్లి ఈసీనగర్ ఫేజ్-2, హెచ్‌బీ కాలనీ తిరుమలనగర్, మల్లాపూర్, అన్నపూర్ణ కాలనీ, నాచారం, కార్తికేయనగర్, హెచ్‌ఎంటీనగర్, రాఘవేంద్రనగర్, వీఎ్‌సటీ కాలనీలో ఆదివారం 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
యూసు్‌ఫగూడ సర్కిల్-19 పరిధిలోని యూసు్‌ఫగూడ, బోరబండ, వెంగళరావుగనర్, రహ్మత్‌నగర్, ఎర్రగడ్డ డివిజన్‌లలో మొత్తం 57 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పాతబస్తీలోని పంజెషా. ఈదీబజార్, అమాన్‌నగర్, బార్కాస్, పార్వతీనగర్, బండ్లగూడ ప్రాంతాల్లో మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో నిర్వహించిన పరీక్షల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
కార్వాన్ నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్ ఆరోగ్య కేంద్రంలో ఒకరికి, పన్నీపూరాలో ఆరుగురికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి నెగెటివ్ వచ్చింది. కార్వాన్ - 2లో ఆదివారం పరీక్షలు నిలిపివేశారు.
మల్కాజిగిరి సర్కిల్‌లో ఐదుగురి మృతి
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఆదివారం ఒక్కరోజే కరోనాతో చికి త్స పొందుతూ ఐదుగురు మృతిచెందారు. ఈస్ట్ ఆనంద్‌బాగ్‌కు చెందిన మహిళ(36), ఉప్పరిగూడకు చెందిన వ్యక్తి (43), ఇందిరా నెహ్రూనగర్‌కు చెందిన వ్యక్తి (60), దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన మహిళ(63), ద్వారకామాయినగర్‌కు చెందిన వ్యక్తి(34) కరోనాతో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
నిజాంపేట్‌లో కరోనా టెస్టింగ్ సెంటర్ ప్రారంభం
నిజాంపేట్ పాలకవర్గం ఇటీవల కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు చేసిన వినతి మేరకు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఉచిత కొవిడ్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు నిజాంపేట మేయర్ నీలాగోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడ ప్రతి మంగళ, గురు, శుక్రవారాలు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు వచ్చేవారు ఆధార్‌కార్డు తప్పని సరిగా తీసుకురావాలని ఆమె సూచించారు.