కాఠిన్యాన్ని పెంచిన కరోనా

ABN , First Publish Date - 2020-06-25T10:00:11+05:30 IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 83 ఏళ్ల ఆ తల్లిని చూసేందుకు ఎవరూ రావడం లేదు

కాఠిన్యాన్ని పెంచిన కరోనా

83 ఏళ్ల  తల్లిని చూసేందుకు బిడ్డల దూరం


అడ్డగుట్ట, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 83 ఏళ్ల ఆ తల్లిని చూసేందుకు ఎవరూ రావడం లేదు. ఇంటికి తీసుకెళ్లి హోం క్వారంటైన్‌లో ఉంచాలని కొడుకు, కూతుళ్లకు సమాచారం అందినా స్పందించడం లేదు. దిక్కుతోచని స్థితిలో అవ్వ కన్నీరుమున్నీరవుతోంది. కరోనా పాజిటివ్‌ రావడంతో నగరానికి చెందిన 83 ఏళ్ల వృద్ధురాలు, ఆమె కొడుకు 20 రోజుల క్రితం గాంధీలో చేరారు.


వారం రోజుల చికిత్స అనంతరం కొడుకు కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. తల్లి ఇంకా ఆస్పత్రిలోనే ఉంది. కానీ ఆమెను చూడడానికి కుటుంబ సభ్యులు ఎవరూ రావడం లేదు. ఆమెను ఆస్పత్రి నుంచి హోం క్వారంటైన్‌కు తీసుకెళ్లమని వైద్యులు కొడుకుకు, ఇద్దరు కూతుళ్లకు వారం రోజుల క్రితమే సమాచారం ఇచ్చారు. కానీ.. ఆమెను తీసుకెళ్లడానికి ఎవరూ రావడం లేదు. బిడ్డల్ని చూడాలని ఆమె తపిస్తోంది. ఇదే చివరి సారి అవుతుందేమోనంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె బాధ చూస్తున్న అక్కడి సిబ్బంది సైతం కన్నీళ్లు పెడుతున్నారు. 

Updated Date - 2020-06-25T10:00:11+05:30 IST