మందుబాబులకు కరోనా కష్టాలు!

ABN , First Publish Date - 2020-03-14T03:42:33+05:30 IST

కరోనా వల్ల దేశాల సరిహద్దులు మూసేస్తున్నారు. రోడ్లు, పబ్లిక్ ప్రదేశాలల్లో ఎవరినీ తిరగనియ్యడం లేదు. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా వల్ల మందుబాబులకూ పెద్ద కష్టం వచ్చి పడింది. నోరు తెరిచి తృప్తిగా మందు తాగలేకపోతున్నారు. అలా అని మందుకు దూరంగా ఉండలేకపోతున్నారు

మందుబాబులకు కరోనా కష్టాలు!

హైదరాబాద్: కరోనా వల్ల దేశాల సరిహద్దులు మూసేస్తున్నారు. రోడ్లు, పబ్లిక్ ప్రదేశాలల్లో ఎవరినీ తిరగనియ్యడం లేదు. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే కరోనా వల్ల మందుబాబులకూ పెద్ద కష్టం వచ్చి పడింది. నోరు తెరిచి తృప్తిగా మందు తాగలేకపోతున్నారు. అలా అని మందుకు దూరంగా ఉండలేకపోతున్నారు. నోటికి మాస్కులతో బార్‌కు వచ్చి మద్యం సేవించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. నోటికి మాస్క్‌ ఉండడంతో గ్లాసులో స్ట్రా వేసుకొని మద్యం సేవిస్తున్నారు. ఈ అనుభవం కొత్తగానే ఉన్నా సంతృప్తి కరంగా ఉందో లేదో వారినే అడగాలి మరి. కింది చిత్రాలు కనుక గమనించినట్లైతే పంజాగుట్ట ఊర్వశి బార్‌లో మందు బాబుల కష్టాలు ఏంటో స్పష్టమవుతాయి. కరోనా ఎంత కష్టం తెచ్చి పెట్టింది!

Updated Date - 2020-03-14T03:42:33+05:30 IST