తెలంగాణలో కరోనా స్ట్రెయిన్ గుర్తింపు!
ABN , First Publish Date - 2020-12-29T15:08:06+05:30 IST
కరోనాతో అతలాకుతలం అయిన ప్రపంచ ప్రజానీకానికి కరోనా స్ట్రెయిన్ రూపంలో మరో కొత్త వైరస్ బెంబేలెత్తిస్తోంది.
హైదరాబాద్: కరోనాతో అతలాకుతలం అయిన ప్రపంచ ప్రజానీకానికి కరోనా స్ట్రెయిన్ రూపంలో మరో కొత్త వైరస్ బెంబేలెత్తిస్తోంది. తెలంగాణలో కరోనా స్ట్రెయిన్‌ను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ గుర్తించినట్లు సమాచారం. కుటుంబ సబ్యులకు సైతం టెస్ట్‌లు చేసి జీన్ మ్యాప్ కోసం సీసీఎమ్‌బీకి శాంపిల్స్ పంపించారు. స్ట్రెయిన్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. ఈరోజు కొత్త కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేయనున్నారు. న్యూ ఇయర్ వేడుకలు వద్దు అని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. స్ట్రెయిన్ వ్యాపించి ఉంటే రాత్రి సమయాల్లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. కొత్త స్ట్రెయిన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు స్ట్రెయిన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయనుట్లు సమాచారం.