గ్రేటర్‌లో పెరుగుతున్న పాజిటివ్స్‌

ABN , First Publish Date - 2020-03-25T09:51:55+05:30 IST

గ్రేటర్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కేసులు నమో దు అయ్యాయి. నగరంలో ఇప్పటికే 14 మంది పా జిటివ్‌లు ఆస్పత్రుల్లో...

గ్రేటర్‌లో పెరుగుతున్న పాజిటివ్స్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కేసులు నమో దు అయ్యాయి. నగరంలో ఇప్పటికే 14 మంది పా జిటివ్‌లు ఆస్పత్రుల్లో ఉండగా, ఈ సంఖ్య పదిహేడుకు చేరింది. బేగంపేటకు చెందిన 61 ఏళ్ల మహిళకు కరోనా వైరస్‌ సోకడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఆమె సౌదీ అరేబియాకు వెళ్లి 10న నగరానికి వచ్చింది. ఆమెకు వైరస్‌ లక్షణాలు కనిపించడంతో రక్తనమూనాలు సేకరించి, ల్యాబ్‌కు పంపించారు. పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రికి తరలించారు. చందానగర్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ 12న జర్మనీకి వెళ్లి వచ్చింది. ఆమె అస్వస్థతకు గురి కాగా, గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పాజిటివ్‌గా తేలింది.


రంగారెడ్డి జిల్లా కోకా పేటకు చెందిన 49 వ్యక్తి ఇటీవల లండన్‌ వెళ్లి వచ్చాడు. అతనికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో  ఆస్పత్రికి తరలిం చి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మంగళవారం వైద్య బృం దం సదరు వ్యక్తుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి వివరాలు సేకరించారు. ఎవరితో కలిశారు, ఎంత మందితో సన్నిహితంగా మెలిగారు, ఎక్కడెక్కడ తిరిగారు సమాచారం సేకరిస్తున్నారు. 


పాజిటివ్‌ కేసులు ఇలా.. 

 1. మహేంద్రహిల్స్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు దుబాయి వెళ్లి బెంగూళురు మీదుగా హైదరాబాద్‌కు వచ్చాడు. ఇతనికి వైరస్‌ తగ్గి డిశ్చార్జి అయ్యాడు. 
 2. కొత్తపేటకు చెందిన 48 ఏళ్ల వ్యక్తి నెదర్లాండ్స్‌కు వెళ్లి వచ్చాడు. 
 3. నాచారానికి చెందిన 21 ఏళ్ల యువకుడు లండన్‌కు వెళ్లి వచ్చాడు. 
 4. సికింద్రాబాద్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి దుబాయి నుంచి వచ్చాడు. 
 5. కొండాపూర్‌కు చెందిన 18 ఏళ్ల యువతి లండన్‌కు వెళ్లి దుబాయి మీదుగా నగరానికి వచ్చింది. 
 6. సికింద్రాబాద్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 
 7. నగరంలోని మన్నెగూడకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి దుబాయికి వెళ్లి వచ్చాడు
 8. కూకట్‌పల్లికి చెందిన 23 ఏళ్ల లండన్‌కు వెళ్లి దోహామీదుగా నగరానికి వచ్చాడు.  
 9. మణికొండకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి స్వీడన్‌ వెళ్లి వచ్చాడు. 
 10. సికింద్రాబాద్‌కు చెందిన 50 ఏళ్ల మహిళకు వైరస్‌ నిర్ధారణ అయ్యింది. 
 11. బల్కంపేటకు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని ఫ్రాన్స్‌ నుంచి వచ్చింది.
 12. సోమాజిగూడకు చెందిన 20 ఏళ్ల యువకుడు న్యూయార్క్‌ మీదుగా నగరానికి వచ్చాడు. 
 13. గచ్చిబౌలి నివాసి 25 ఏళ్ల విద్యార్థి లండన్‌కు వెళ్లి వచ్చాడు. 
 14. కూకట్‌పల్లికి చెందిన 56 ఏళ్ల మహిళ శ్రీలంక వెళ్లి వచ్చింది. 
 15. చందానగర్‌ నివాసి 61 ఏళ్ల మహిళకు వైరస్‌ సోకింది, ఆమె ఇటీవల జర్మనీ వెళ్లి వచ్చింది.
 16. బేగంపేటకు చెందిన 39 ఏళ్ల మహిళ సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చింది.
 17. కోకాపేట నివాసి 49 ఏళ్ల వ్యక్తి ఇటీవల లండన్‌ వెళ్లి వచ్చాడు.  

Read more