నగరాన్ని వీడని కరోనా

ABN , First Publish Date - 2020-08-12T09:33:47+05:30 IST

కరోనా వైరస్‌ నగరాన్ని వీడడంలేదు. సుమా రు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

నగరాన్ని వీడని కరోనా

సిటీ న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నగరాన్ని వీడడంలేదు. సుమా రు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అనుమానితులు ర్యాపిడ్‌ పరీక్షలకోసం సెంటర్లకు పరుగులు తీస్తుండగా, మరికొంతమంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.


కూకట్‌పల్లిలో 49 కరోనా కేసులు

కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధిలో మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ, మూసాపేట, కూకట్‌పల్లి, పర్వత్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన 49 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. 


కుత్బుల్లాపూర్‌లో 60 కేసులు

కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని 4 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు దుండిగల్‌ పీహెచ్‌పీలో మంగళవారం 478 మందికి కొవిడ్‌  పరీక్షలు నిర్వహించగా వారిలో 60 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కుత్బుల్లాపూర్‌ యూపీహెచ్‌సీలో 15 మందిలో నలుగురికి, గాజులరామారం యూపీహెచ్‌సీలో 48 మందిలో 8 మందికి, సూరారం యూపీహెచ్‌సీలో 98 మంది లో 12మందికి, షాపూర్‌నగర్‌ యూపీహెచ్‌సీలో 237 మందిలో 26 మందికి, దుండిగల్‌ పీహెచ్‌సీ లో 80 మందిలో 10 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 


యూపీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ పరీక్షలు

సీతాఫల్‌మండి డివిజన్‌లోని మూడు యూపీహెచ్‌సీల్లో మంగళవారం ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించారు. మహ్మద్‌గూడలో రెడ్‌క్రాస్‌ ఆస్పత్రిలో 26 మందిలో ఐదుగురికి, సీతాఫల్‌మండి కుట్టివెల్లోడి యూపీహెచ్‌సీలో 30 మందిలో ఇద్దరికి, చిలకలగూడ శ్రీనివా్‌సనగర్‌ యూపీహెచ్‌సీల్లో 28 మందికి పరీక్షలు చేయగా నలుగురికి కరోనా పాజిటివ్‌లు నిర్ధారణ అయిందని ఆయా కేంద్రాల వైద్యులు తెలిపారు. 


 హెల్త్‌ సెంటర్లలో ర్యాపిడ్‌ పరీక్షలు 

కార్వాన్‌ నియోజకవర్గంలోని ఆయా అర్బన్‌ పోస్టు హెల్త్‌ సెంటర్లలో మంగళవారం ర్యాపిడ్‌ పరీక్షలు చేశారు. ఇందులో గోల్కొండ కుమ్మర్‌వాడీలో 34 మందిలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. గుడిమల్కాపూర్‌ ఆరోగ్య కేంద్రంలో 36 మందిలో ముగ్గురికి, కార్వాన్‌-లో 22 లో ముగ్గురికి, పన్నీపూరాలో 14 మందిలో ముగ్గురికి, గోల్కొండలో 13 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, కార్వాన్‌-1లో 27 మంది పరీక్షలు చేసుకోగా 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


మొబైల్‌ వాహనంలో కరోనా పరీక్షలు 

కార్వాన్‌ నియోజకవర్గంలోని శ్రీరాంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో 185 మందికి మొబైల్‌ వాహనంలో కరోనా పరీక్షలు నిర్వహించినట్టు డాక్టర్‌ అనురాధ తెలిపారు. అదేవిధంగా మెహిదీపట్నం సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో 156 మందికి పరీక్షలు చేయగా 23 మందికి పాజిటివ్‌గా తేలినట్టు ఆమె తెలిపారు.    


శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 38..

 శేరిలింగంపల్లి నియోజకవర్గంలో శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట, రాయదుర్గం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. శేరిలింగంపల్లి ఆరోగ్య కేంద్రంలో 58 మందికి పరీక్షలు చేయగా ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. హఫీజ్‌పేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో 77 మందిలో 19, రాయదుర్గం ఆరోగ్య కేంద్రంలో 50 మందికి పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 


ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో 70  

ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలో మంగళవారం 70 కరోనా పాజిటివ్‌ కేసులకు చికిత్స అందించారు. వీటితో పాటు 55 అనుమానిత కేసులను కలుపుకుని మొత్తం 125 కరోనా కేసులకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ తెలిపారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రిలో 24 కరోనా పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు.  


యూసు్‌ఫగూడ సర్కిల్‌-19 పరిధిలో 9 ..

 జీహెచ్‌ఎంసీ యూసు్‌ఫగూడ సర్కిల్‌-19 పరిధిలో మంగళవారం 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యూసు్‌ఫగూడ డివిజన్‌లో 1, బోరబండ డివిజన్‌లో 3, ఎర్రగడ్డ డివిజన్‌లో 2, రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో 2, వెంగళరావునగర్‌ డివిజన్‌లో 1 కేసులు నమోదయ్యాయి. వారిని ఆస్పత్రులకు తరలించి ఆయా ప్రాంతాలను అధికారులు కట్టడి ప్రాంతాలుగా ప్రకటించారు. 

Updated Date - 2020-08-12T09:33:47+05:30 IST