భారమైనా దూరంగా ఉందాం

ABN , First Publish Date - 2020-04-05T09:22:59+05:30 IST

కరోనాను ఎలా ఎదుర్కోవచ్చు అనేది సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శనివారం ఒక వీడియో సందేశం ద్వారా వివరించారు.

భారమైనా దూరంగా ఉందాం

కరోనాను కట్టడి చేద్దాం

బంధువులను రానీయకండి..

భౌతిక దూరం బహు ముఖ్యం

లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్‌ వస్తోంది

కట్టుదిట్టంగా లేకుంటే కష్టమే: సీపీ సజ్జనార్‌ 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కరోనాను ఎలా ఎదుర్కోవచ్చు అనేది సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శనివారం ఒక వీడియో సందేశం ద్వారా వివరించారు. 


అత్యవసర సేవల నిమిత్తం మాత్రమే బయటకు రావాలి. అనవసరంగా ఇళ్లు దాటి బయటకు వచ్చి ఇబ్బందులు తెచ్చుకోవద్దు.


బంధువులు, స్నేహితులు, పక్కంటి, పొరుగింటి వారి ఇళ్లకు వెళ్లడం మంచిదికాదు.. ఇతరులెవరినీ మన ఇంటికి రానివ్వొద్దు. కష్టమైనా సరే.. కరోనా అంతం చేయడానికి ఈ నిబంధన పాటించాల్సిందే.


అత్యవసర సేవల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా వాడాలి.


అన్నింటికంటే ముఖ్యం బౌతిక దూరం.. కరోనా విజృంభించడానికి ప్రధాన కారణం ప్రజల మధ్య భౌతిక దూరం లేకపోవడమే. కచ్చితంగా మనిషికి మనిషికి మధ్య 3-6 ఫీట్ల దూరం విధిగా పాటించాలి. కానీ బయటకు వస్తున్న వారిలో అధిక శాతం మంది భౌతిక దూరాన్ని పాటించడంలేదు. మార్కెట్‌కు, దుకాణం, ఆస్పత్రి, ఉద్యోగం ఇలా బయటకు ఎక్కడికి వెళ్లినా భౌతిక దూరాన్ని పాటించడం మర్చిపోవద్దు.


ప్రస్తుతం కరోనా తన రూపాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం ఉంటేనే కరోనా లక్షణాలుగా అనుమానించేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా పరీక్షలో మాత్రం కరోనా పాజిటివ్‌ అని వస్తోంది. దాంతో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలి.

Updated Date - 2020-04-05T09:22:59+05:30 IST