లాలాగూడ ఆస్పతిలో కరోనా వైద్యం

ABN , First Publish Date - 2020-06-22T09:50:00+05:30 IST

కరోనా బాధితులకు వైద్యం అం దించేందుకు లాలాగూడలోని కేంద్ర రైల్వే ఆస్పత్రి సిద్ధమైంది.

లాలాగూడ ఆస్పతిలో కరోనా వైద్యం

 8 142 పడకలతో ఐసోలేషన్‌ వార్డు సిద్ధం   


సికింద్రాబాద్‌, జూన్‌  21 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకు వైద్యం అం దించేందుకు లాలాగూడలోని కేంద్ర రైల్వే ఆస్పత్రి సిద్ధమైంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజనన్‌ మల్యా ఆదేశాల మేరకు లాలాగూడ ఆస్పత్రితోపాటు మరో నాలుగు పెద్ద ఆస్పత్రులు, 44 ఆరోగ్య కేంద్రాలను కరోనా వైద్యం కోసం సిద్ధం చేశారు. లాలాగూడ ఆస్పత్రిలో 142 పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు.


ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు 43 మంది వైద్యులు, 161 మంది పారామెడికల్‌ సిబ్బందిని నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. వీడియో కాల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టారు. సికింద్రాబాద్‌ డివిజన్‌లో 142, విజయవాడలో 129, హైదరాబాద్‌ డివిజన్‌లో 147, గుంతకల్‌ డివిజన్‌లో 234 పడకలను సిద్ధం చేశారు.  రైల్వే సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు తదితర రైల్వే సంస్థలను క్వారంటైన్‌ కేంద్రాలుగా రూపొందించారు. రైల్వే అదికారులు, సిబ్బందికి లాలాగూడలోని ఆస్పత్రిలో వైద్య చికిత్సలకు అనుమతి ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ నేత భరణీభాను ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు ఆయన జీఎంకు, ప్రభుత్వానికి లేఖ రాశారు.  

Updated Date - 2020-06-22T09:50:00+05:30 IST