వీఐపీ ఠాణాలో..నలుగురు సిబ్బందికి కరోనా

ABN , First Publish Date - 2020-06-18T09:53:12+05:30 IST

నగరంలో వీఐపీ ఠాణాగా గుర్తింపు పొందిన బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌ను కరోనా వణికిస్తోంది

వీఐపీ ఠాణాలో..నలుగురు సిబ్బందికి కరోనా

ఆ పీఎ్‌సలోనే అత్యధిక కేసులు 


బంజారాహిల్స్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): నగరంలో వీఐపీ ఠాణాగా గుర్తింపు పొందిన బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌ను కరోనా వణికిస్తోంది. ఈ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న నలుగురు తాజాగా కరోనా బారిన పడ్డారు. ఓ ఎస్‌ఐతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు 22 మంది సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. 


ముందస్తు జాగ్రత్తలు పాటించినా..

కరోనా కలకలం ప్రారంభమైనప్పటి నుంచే బంజారాహిల్స్‌లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. శానిటైజర్ల వినియోగం, భౌతికదూరం వంటి నిబంధనలన్నీ పాటించారు. ప్రతివారం పోలీ్‌సస్టేషన్‌ భవనాలను, వాహనాలను శానిటైజ్‌ చేశారు. అయినా, పోలీ్‌సస్టేషన్‌ సిబ్బంది ఒక్కొక్కరుగా వైరస్‌ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు ఠాణాలోని పోలీసులు పదిరోజులపాటు శ్రమించారు.


ఆ సమయంలో వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. పదిరోజుల క్రితం ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో పోలీ్‌సస్టేషన్‌ సిబ్బంది మొత్తం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మరుసటి రోజే పదిమందికి పాజిటివ్‌ వచ్చింది. అందులో అడ్మిన్‌ ఎస్‌ఐ కూడా ఉన్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కానిస్టేబుళ్లలో ఎవరికీ ఆ లక్షణాలు కనిపించలేదు.  పాజిటివ్‌ వచ్చిన వారు మంగళవారం రాత్రి పోలీ్‌సస్టేషన్‌లో నైట్‌ డ్యూటీలో ఉన్నారు. పీఎ్‌సలో సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో అక్కడ పనిచేసేందుకు సిబ్బంది భయపడుతున్నారు. 

Updated Date - 2020-06-18T09:53:12+05:30 IST