24 గంటలూ కంట్రోల్‌ రూమ్‌..!

ABN , First Publish Date - 2020-03-23T09:22:01+05:30 IST

జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలు పని చేయనుంది. మూడు షిఫ్టులుగా ఉద్యోగులకు విధి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.

24 గంటలూ కంట్రోల్‌ రూమ్‌..!

హైదరాబాద్‌ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలు పని చేయనుంది. మూడు షిఫ్టులుగా ఉద్యోగులకు విధి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లను పరిశీలించే 150 బృందాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్‌ రూమ్‌కు చేరవేస్తాయి. జీహెచ్‌ఎంసీ, 108 వాహన సర్వీసు, వైద్యారోగ్య శాఖల సిబ్బంది ఉంటారు. ఇన్‌చార్జ్‌గా సీనియర్‌ అధికారికి బాధ్యతలు అప్పగిస్తూ, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ బాధ్యతను ఇద్దరు అధికారులకు అప్పగించారు. 


కమిషనర్‌ చప్పట్ల సంఘీభావం... 

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు జరిగిన జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం చప్పట్లు  కొట్టి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ సంఘీభావం తెలిపారు. సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయం వద్ద కమిషనర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు వైద్యులు, నర్సులు, ఇతర విభాగాల సిబ్బందికి సంఘీభావ సంకేతాన్ని చప్పట్ల ద్వారా తెలియజేశారు. 

Updated Date - 2020-03-23T09:22:01+05:30 IST