‘వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలి’

ABN , First Publish Date - 2020-09-25T07:30:23+05:30 IST

వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని భారతీయ వజ్ర పార్టీ చైర్మన్‌ మల్లేశ్వర ప్రసాద్‌ అన్నారు

‘వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలి’

పంజాగుట్ట, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని భారతీయ వజ్ర పార్టీ చైర్మన్‌ మల్లేశ్వర ప్రసాద్‌ అన్నారు. గురువారం సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో జాతీయ వినియోగదారుల హక్కుల సంస్థ హైదరాబాద్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌గా నియమితు లైన ఉషారాణి, నాగుబండి రమేష్‌లకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. వినియో గదారులకు ఏర్పడే పలు సమస్యలను ఆయా విభాగాల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేయడమే కాకుండా కోర్టుల ద్వారా నష్టపరిహారం, న్యాయాన్ని వినియోగదా రులకు అందేలా సేవ చేస్తామని ఉషారాణి,  రమేష్‌లు తెలిపారు. సమావేశంలో లీగల్‌ అడ్వై జర్‌లలితారెడ్డి, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T07:30:23+05:30 IST