డబ్బులు వసూలు చేసిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-05-17T15:14:07+05:30 IST

లాక్‌డౌన్‌లో పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఒకరి నుంచి డబ్బులు వసూలు చేసిన

డబ్బులు వసూలు చేసిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్/కుత్బుల్లాపూర్‌ : లాక్‌డౌన్‌లో పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఒకరి నుంచి డబ్బులు వసూలు చేసిన పెట్రో మొబైల్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మహారాష్ట్ర నుంచి పరుశురాం అనే వ్యక్తి పద్మానగర్‌ ఫేజ్‌-2కు ఇటీవల వచ్చాడు. విచారణ నిమిత్తం పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌కు చెందిన పెట్రో మొబైల్‌ కానిస్టేబుల్‌ రవీందర్‌ వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ పరుశురాం నుంచి రూ. 500 డిమాండ్‌ చేశాడు.


ప్రస్తుతం నగదు లేదని చెప్పినా వినలేదు. ఓ పే యాప్‌ ద్వారా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేశాడు. పరుశురాం కుమారుడు పవన్‌కల్యాణ్‌ రూ. 300 చెల్లించాడు. తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు,  మంత్రులతో పాటు పలువురికి ట్విటర్‌ ద్వారా తెలియపరిచాడు. విషయం పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి వెళ్లడంతో కానిస్టేబుల్‌ రవీందర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-05-17T15:14:07+05:30 IST