తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేక
ABN , First Publish Date - 2020-07-10T09:56:25+05:30 IST
తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

కానిస్టేబుల్ ఆత్మహత్య
బోడుప్పల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ములుగు జిల్లా, వాజేడు గ్రామానికి చెందిన నాగసాయిచంద్(25) రెండేళ్లుగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తూ మేడిపల్లి నిహారిక కాలనీలో నివసిస్తున్నాడు. తల్లిదండ్రులు అతడికి పెళ్లి సంబంధం చూశారు. అది ఇష్టం లేక నాగసాయిచంద్ గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.