పెట్రోల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్‌ నిరసన

ABN , First Publish Date - 2020-06-25T09:52:05+05:30 IST

పెట్రోల్‌ ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు వినూత్న తరహాలో రిక్షా ర్యాలీతో వీధుల్లో కదం తొక్కారు.

పెట్రోల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్‌ నిరసన

అఫ్జల్‌గంజ్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌ ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు వినూత్న తరహాలో రిక్షా ర్యాలీతో వీధుల్లో కదం తొక్కారు. బుధవారం తెలంగాణ పీసీసీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ప్రీతం సారథ్యంలో పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌ నుంచి సచివాలయం వరకు రిక్షాలు తొక్కుతూ నిరసన చేపట్టారు. ఈ ర్యాలీ నాంపల్లి మెట్రోస్టేషన్‌ వద్దకు రాగానే పోలీసులు వారిని అరెస్టు చేసి బేగంబజార్‌ పీఎ్‌సకు తరలించారు. కాంగ్రెస్‌ నాయకులు మహేశ్‌ రాజ్‌, జె.తిరుమలరావు, పరికి నర్సింగ్‌ రావు, వినోద్‌సింగ్‌, బిట్టుకుమార్‌, రమేశ్‌ బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T09:52:05+05:30 IST