ఉత్తమ్‌తో వీహెచ్ భేటీ

ABN , First Publish Date - 2020-12-28T17:24:07+05:30 IST

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు సోమవారం ఉదయం భేటీ అయ్యారు.

ఉత్తమ్‌తో వీహెచ్ భేటీ

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తనకు రేవంత్ అభిమానుల పేరుతో బెదిరింపు కాల్స్ రావడంపై ఫిర్యాదు చేశారు. గతంలో ఎప్పుడూ లేని సంస్కృతిని రేవంత్ తెస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులను రేవంత్ ఎందుకు నియంత్రించడం లేదని నిలదీశారు. రేవంత్, తన అభిమానులపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌ను వీహెచ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-12-28T17:24:07+05:30 IST