గుండెపోటుతో కాంగ్రెస్ నేత మృతి
ABN , First Publish Date - 2020-06-22T10:07:48+05:30 IST
ముషీరాబాద్ నియో జకవర్గం రాంనగర్ జెమిని కాలనీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుబ్బయ్యగౌడ్ ఆదివారంతో గుండెపోటుతో
రాంనగర్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్ నియో జకవర్గం రాంనగర్ జెమిని కాలనీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుబ్బయ్యగౌడ్ ఆదివారంతో గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. జెమిని కాలనీలో శ్రీ సాయిబాబా దేవాలయ వ్యవస్థాపకులుగా ఆయన ఎంతో కృషి చేశారు. పార్టీలో పలు పదవులు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.