మీ సేవకు సలాం..

ABN , First Publish Date - 2020-04-25T10:48:38+05:30 IST

కరోనా వైర్‌సను అరికట్టడంలో అహర్నిశలు శ్రమిస్తున్న శానిటేషన్‌, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సేవలను మేయర్‌ బొంతు

మీ సేవకు సలాం..

పారిశుధ్య సిబ్బందికి అభినందనలు

ప్రతిజ్ఞ చేయించిన మేయర్‌, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి


చార్మినార్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సను అరికట్టడంలో అహర్నిశలు శ్రమిస్తున్న శానిటేషన్‌, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సేవలను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రశంసించారు. శుక్రవారం చార్మినార్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. కరోనా వైర్‌సను తరిమికొట్టడంలో ముందుండి పని చేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ కరోనా వైర్‌సపై ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ కలిసి పోరాడుతున్నాయని, ప్రజలు ఇళ్లలోనే ఉండి సహకరించాలని కోరారు. కరోనాను ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారన్నారు.


కరోనా వైర్‌సను అరికట్టడంలో గ్రేటర్‌లోని 25 వేల మంది పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ మాట్లాడుతూ నగరం ఇంత సేఫ్‌గా ఉండడం వెనుక పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న సిబ్బంది కృషి ఎంతో ఉందని, వారందరికీ వందనాలని తెలిపారు. ప్రజల కోసం సేవ చేస్తున్న వీరంతా తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న వారి సేవలను గుర్తించారని, అందువల్లే వారికి పూర్తి వేతనం ఇవ్వడంతో పాటు అదనంగా సీఎం గిఫ్ట్‌ కూడా ఇచ్చారని తెలిపారు.


కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి, దక్షిణ మండలం స్పెషల్‌ ఆఫీసర్‌ సోలిపేట శ్రీనివా్‌సరెడ్డి, జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌  పాల్గొన్నారు.

Updated Date - 2020-04-25T10:48:38+05:30 IST