బావమరిదిని చూసేందుకు వచ్చి అదృశ్యం

ABN , First Publish Date - 2020-06-26T09:49:46+05:30 IST

ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బావమరిదిని చూసేందుకు నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన గురువారం

బావమరిదిని చూసేందుకు వచ్చి అదృశ్యం

అఫ్జల్‌గంజ్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బావమరిదిని చూసేందుకు నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన గురువారం అఫ్జల్‌గంజ్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలానికి చెందిన టి.అబ్దుల్లప్ప బావమరిది రాజప్ప అనారోగ్యంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 13న ఉస్మానియా ఆస్పత్రికి వచ్చాడు. అబ్దుల్లప్ప రాజప్పను చూసి ఇంటికి వెళ్తానని చెప్పి స్వగ్రామానికి వెళ్లలేదు. ఈ నెల 20న రాజప్ప డిశ్చార్జ్‌ అయి స్వగ్రామానికి వెళ్లాడు. కాగా నగరానికి వెళ్లిన తన భర్త తిరిగి ఇంటికి రాలేదని రాజప్పతో చెప్పడంతో బంధువులు, పరిసర ప్రాంతాల్లో వాకబు చేసినా ఆచూకీ దొరకలేదు. దీంతో  ఆమె అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-26T09:49:46+05:30 IST