కూలిపోయిన ఇల్లు

ABN , First Publish Date - 2020-10-21T11:03:09+05:30 IST

భారీ వర్షాలతో హిమాయత్‌నగర్‌లో శిథిలావస్థల్లో ఉన్న ఓ ఇల్లు మంగళవారం ఉదయం కుప్పకూలింది. వీధి నెంబర్‌ 13లో నాలా పరివాహకానికి దగ్గరగా ఉండే ఆదర్శ బస్తీలో స్వామి అనే వ్యక్తికి చెందిన పాత ఇల్లు అది.

కూలిపోయిన ఇల్లు

హిమాయత్‌నగర్‌, అక్టోబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో హిమాయత్‌నగర్‌లో శిథిలావస్థల్లో ఉన్న ఓ ఇల్లు మంగళవారం ఉదయం కుప్పకూలింది. వీధి నెంబర్‌ 13లో నాలా పరివాహకానికి దగ్గరగా ఉండే ఆదర్శ బస్తీలో స్వామి అనే వ్యక్తికి చెందిన పాత ఇల్లు అది. శిథిలావస్థకు చేరడంతో రెండేళ్ల క్రితమే ఆ ఇల్లును స్వామి కుటుంబం ఖాళీ చేసింది. ఎడతెరిపి లేని వర్షాలకు పూర్తిగా తడిసిపోయిన ఇల్లు మంగళవారం కూలిపోయింది.


Updated Date - 2020-10-21T11:03:09+05:30 IST