ఒకరితో సహజీవనం.. మరొకరితో వివాహం

ABN , First Publish Date - 2020-09-12T09:51:02+05:30 IST

పెద్దల మధ్య పెళ్లి చేసుకుంటానని ఒప్పందం కుదుర్చుకొని యువతితో సహజీనవం చేశాడు.

ఒకరితో సహజీవనం.. మరొకరితో వివాహం

బంజారాహిల్స్‌, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): పెద్దల మధ్య పెళ్లి చేసుకుంటానని ఒప్పందం కుదుర్చుకొని యువతితో సహజీనవం చేశాడు. అనంతరం మరో యువతిని వివాహం చేసుకున్న వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయ్‌నగర్‌కు చెందిన ఓ యువతి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తోంది.. రెండ్లే క్రితం దుబాయ్‌లో ఉద్యోగం చేసే శివశంకర్‌తో పరిచయం కాగా ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించారు.


2019 మేలో పెళ్లి చేయాలని భావించారు. యువతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో వివాహాన్ని ఈ ఏడాది మార్చికి వాయిదా వేసుకున్నారు. దీనికి శివశంకర్‌ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ఈ ఏడాది జనవరిలో శివశంకర్‌ దుబాయ్‌ రావాలని యువతిని కోరాడు. కొద్ది రోజులకు యువతి దుబాయ్‌ వెళ్లింది. అతడు పనిచేసే కార్యాలయానికి వెళ్లగా భారత్‌ వెళ్లినట్లు తోటి ఉద్యోగులు చెప్పారు. వాకబు చేయగా.. శివశంకర్‌ మరో యువతిని వివాహం చేసుకున్నట్టు తెలిసింది. తనతో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా శివశంకర్‌ మోసం చేశాడని బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Updated Date - 2020-09-12T09:51:02+05:30 IST