నేడు నోముల అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2020-12-03T12:33:35+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జిల్లాలోని నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి వెళ్లనున్నారు.

నేడు నోముల అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జిల్లాలోని నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి వెళ్లనున్నారు. పాలెంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 10:50గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలుదేరనున్న సీఎం...11:25గంటలకు హెలికాప్టర్‌లో పాలెం గ్రామానికి చేరనున్నారు. ఎమ్మెల్యే నోముల అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చి 12 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు ప్రయాణంకానున్నారు. సీఎం రాక నేపథ్యంలో  ఉన్నతాధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-12-03T12:33:35+05:30 IST