కార్మికులకు సీఎం కేసీఆర్ గిఫ్ట్..!
ABN , First Publish Date - 2020-04-08T09:40:52+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలం తా ఇళ్లలోనే ఉంటున్నారు. పారిశుధ్య కార్మికులు

హైదరాబాద్‌సిటీ/ మియాపూర్/నార్సింగి/ బేగంపేట/ సరూర్‌నగర్/హయత్‌నగర్, ఏప్రిల్ 07(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలం తా ఇళ్లలోనే ఉంటున్నారు. పారిశుధ్య కార్మికులు రోడ్లు ఊడుస్తున్నారు. ఎంటమాలజీ విభాగం, డీఆర్‌ఎఫ్ బృం దాలు క్రిమిసంహారం కోసం సోడియం హైపో క్లోరైట్ ద్రావకం పిచికారి చేస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో రెండు, మూడు విడతలుగా రసాయనాలు స్ర్పే చేస్తున్నారు. ఈ ప్రక్రియలో జీహెచ్‌ఎంసీకి చెందిన, శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్ విభాగాల్లోని 27,690 మంది ఉన్నారు.
ఇందులో పారిశుధ్య కార్మికుల, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంటమాలజీ కార్మికు లు, సహాయ ఎంటమాలజిస్టులు, ఇతర సిబ్బంది ఉంటా రు. వీరందరికి ప్రోత్సాహకంగా రూ.7,500 ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాటర్‌బోర్డులో నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ విధుల్లో 2,510 మంది పని చేస్తున్నారు. వీరికి కూడా నగదు ప్రోత్సాహకం అందనుంది. మార్చి వేతనాల్లో కోత విధించిన 10 శాతం కూడా చెల్లించనున్నారు. జీహెచ్‌ఎంసీలో పని చేసే వారికి రూ.20.76 కోట్లు, వాటర్‌బోర్డు సిబ్బందికి రూ.1.88 కోట్లు ఇవ్వనున్నారు.
కార్మికులకు సన్మానం
జిల్లెలగూడలో చెత్త సేకరించే రిక్షా కార్మికులను సీతాహోమ్స్, న్యూగాయత్రీనగర్ కాలనీల ప్రతినిధులు మూ డో డివిజన్ కార్పొరేటర్ ఎ.రాజమణి అంజిరెడ్డితో కలిసి ఒక్కొక్కరికి రూ.రెండు వేలు చొప్పున నగదు సాయం అందజేశారు. కార్మికులను పూలమాలలతో సత్కరించా రు. సోమాజిగూడ డివిజన్ ఎం.ఎస్ మక్తాలో చెత్తను సేకరిస్తున్న ప్రభాకర్‌ను మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ సన్మానించడంతో పాటు కొంత నగదును అందజేశారు.
బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లోని నాదర్‌గుల్‌లో కార్పొరేటర్లు ఇంద్రసేన, సునీతాశ్రీకాంత్‌గౌడ్, అమితాశ్రీశైలంచారి, శ్రీధర్‌రెడ్డి తదితరులు తమ వార్డుల్లో పారిశుధ్య కార్మికులకు మేయర్ పారిజాతారెడ్డితో కలిసి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కోకాపేటలో పారిశుధ్య కార్మికులను నలుగురు కౌన్సిలర్లు ఘనంగా సత్కరించి, నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, మాస్క్‌లు అందజేశారు. నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ రేఖ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు శివారెడ్డి, విజయ్‌బాబు, దుర్గేశ్, ఆధిత్యరెడ్డిలు తమ వం తు సహాయం అందించారు. మణికొండ నాలుగో వార్డు కౌన్సిలర్ వందన నాగేశ్ రోజు వారీ కూలీలకు వరుసగా ఐదవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మియాపూర్ పీఏనగర్‌లోకాలనీ అధ్యక్షుడు పీవై రమేశ్ సత్కరించి, నూతన దుస్తులు అందజేశారు.
ధన్యవాదాలు : పులి రేణుక, పారిశుధ్య కార్మికురాలు
అందరి ఆరోగ్యం కోసం మేం పని చేస్తున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అధికారులు వివరిస్తున్నారు. మా కష్టాన్ని గుర్తించి సీఎం సారు రూ.7,500 ఇవ్వడం సంతోషకరం. మా లాంటి వాళ్లకు ఇది కొంత ఉపశమనంగా ఉంటుంది. సారుకు ధన్యవాదాలు.
సంతోషంగా ఉంది :రాము, శానిటరి ఫీల్డ్ అసిస్టెంట్
నేను శానిటరి ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్‌ఎ్‌ఫఏ)గా పని చేస్తున్నా. విదేశాలకు, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి గుర్తించేందుకు అధికారులతో కలిసి తిరుగుతున్నాం. వాళ్లు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారా... లేదా..? అన్నదీ పరిశీలిస్తున్నాం. సీఎం సార్ బహుమతి మాకు ప్రోత్సాహకం.
మురుగు కార్మికులూ వర్తింపు..
గ్రేటర్ పరిధిలో సుమారు 5వేల మంది కార్మికులు మురుగునీటి నిర్వహణలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి సీఎం ప్రకటించిన రూ. 7,500 ప్రోత్సాహకం అందనుంది. దీంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాటర్‌బోర్డులోని మినీ ఎయిర్‌టెక్ మిషన్లను అద్దె ప్రతిపాదికన నిర్వహిస్తున్నారు. ఈ ఎయిర్ టెక్ మిషన్లపై పని చేసే డ్రైవర్లకు, హెల్పర్లకు ఏలాంటి గుర్తింపు కార్డుల్లేవ్. కొంతమందికి ఈఎ్‌సఐ, పీఎ్‌ఫలు కూడా లేదు. ఏజెన్సీలు ప్రతీ నెలా అందజేయాల్సిన వేతనాలను కూడా సక్రమం గా ఇవ్వడం లేదు. కొందరికి ఫిబ్రవరి వేతనాలే ఇంకా చెల్లించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో తమకు ప్రోత్సహకం అందుతుందా? లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు.